- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐతో కలిసి పనిచేయాలి.. సర్వే ఆధారంగా పార్టీ టికెట్ : మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారంమహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారంమహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్, ఇల్లందు, కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు ఉమా మురళి నాయక్, దేవి ప్రసన్న ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నేతలు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. ఏకాభిప్రాయం లేని వార్డులపై ముఖాముఖి మాట్లాడి సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్టు కేటాయించిందని, అందరూ కలిసి పని చేయాలని సూచించినట్లు తెలిపారు. పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ సీపీఐ కలిసి పని చేయాలని సూచించారు. కాగా, మహబూబాబాద్, ఇల్లందు, కేసముద్రం మున్సిపాలిటీ లలో పోటీ చేసే అభ్యర్థులకు డీసీసీ అధ్యక్షుల ద్వారా ఆయన బీ-ఫార్మ్‌లు అందజేశారు.






