హైదరాబాద్ నుంచి పోలింగ్ బూత్ వరకు నెట్‌వర్క్‌ సిస్టమ్.. టీపీసీసీ సమావేశంలో చర్చలపై మంత్రి వివరణ

by Ramesh Naini |

టీపీసీసీ చేపడుతున్న కార్యక్రమాలు , ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

హైదరాబాద్ నుంచి పోలింగ్ బూత్ వరకు నెట్‌వర్క్‌ సిస్టమ్.. టీపీసీసీ సమావేశంలో చర్చలపై మంత్రి వివరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: టీపీసీసీ (TPCC) చేపడుతున్న కార్యక్రమాలు , ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కార్యకర్తలు మరింత చురుకుగా పని చేస్తూ హైదరాబాద్ నుంచి పోలింగ్ స్టేషన్ వరకు ఒక నెట్‌వర్క్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చలపై సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం పై చర్చించినట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఓటు చోరీ కి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీకి మద్దతుగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు.

పీసీసీ అధ్యక్షుడు ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 15 న కామారెడ్డిలో వారికి అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే బీసీ డిక్లరేషన్ జరిగిన కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ల పై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సభలో వివరించడం జరుగుతుందన్నారు. బీజేపీ కడుపుల్లో కత్తులు పెట్టుకొని రిజర్వేషన్లు అడ్డుకుంటున్న అంశాలపై ప్రజలకు వివరిస్తామన్నారు. రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పై ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ బలోపేతంపై సంస్థాగత కార్యక్రమాలు చేపడతామన్నారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే రాజకీయ విమర్శ అన్నారు.. కాళేశ్వంలో అవినీతి జరిగిందని ఇప్పుడు వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న జనహిత పాదయాత్ర త్వరలోనే తేదీలు ప్రకటిస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ కుటుంబంలో ఉండి అనివార్య కారణాల వల్ల పార్టీ మారిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

స్థానిక సంస్థలు 42 శాతం రిజర్వేషన్లు పై చర్చ జరిగిందన్నారు. శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించామని, దానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఇబ్బందులు ఉండవన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని చిత్తశుద్ధి తో ఉందని, అఖిలపక్ష పార్టీల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైనట్లు తెలిపారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిందని తెలిపారు. సమావేశానికి ఎఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పోరేషన్ చైర్మన్‌లు పాల్గొన్నారని వెల్లడించారు.

Next Story