- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ప్రతి మహిళకు సారే.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మహిళకు సారే పంపుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సంఘాల వారు ప్రతి ఇంటికి వెళ్ళి మహిళకు బొట్టు పెట్టి సారే అందించాలని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలిపారు. సోదరుడు లాగా మీ అందరికీ అండగా ఉంటా.. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం మహిళలకు బొట్టు పెట్టి సారే అందించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, ఆర్డీవో రామ్మూర్తి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.






