Alert: నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి పొన్నం అలర్ట్ ట్వీట్. ఎందుకంటే?

by Ramesh Naini |

నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Alert: నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి పొన్నం అలర్ట్ ట్వీట్. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల (Heavy rains) నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా (Alert) ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా వివరాలు తెలిపారు. భారీ వర్షాల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, సీపీ సివి ఆనంద్,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. వారికి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ బృందాలను ఉంచాలని, మ్యాన్ హోల్స్ నాళాల వద్ద ఎక్కడైనా నీరు జామ్ అయితే వెంటనే సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. అధికారులంతా సమన్వయం చేసుకుంటూ నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story