- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhudhar Card: ఆధార్ లాగా భూధార్ కార్డులు వస్తున్నాయి: మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
తెలంగాణలో ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డులు (Bhudhar cards) వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డులు (Bhudhar cards) వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో లక్షలాది భూ సమస్యలు వచ్చాయని, ఇచ్చిన హామీ మేరకు నూతన భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం (x) ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. (Bhubharati) భూ భారతి పై అన్ని మండలాల్లో అధికారుల చేత అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి అంటేనే ఆత్మగౌరవం అలాంటి భూమి పై పంచాయతీలు హత్యల వరకు దారితీస్తున్నాయని అన్నారు. భూ వివాదాల్లో గతంలో ఎమ్మార్వో ను కూడా తగలబెట్టిన ఘటనలు చూశామన్నారు. ధరణి ద్వారా దశాబ్దాల క్రితం భూమి అమ్మిన కూడా తిరిగి అమ్మిన వ్యక్తి పేరు మీదనే భూ హక్కులు వచ్చాయన్నారు. దీని ద్వారా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గతంలో భూమి అమ్మినప్పుడు ఆ గ్రామ పెద్ద మనుషులు చెప్తే అయిపోతుందని, తర్వాత తెల్ల కాగితాల మీద రాసుకోవడం రిజిస్ట్రేషన్ లు వచ్చాయన్నారు. ఇప్పుడు భూమి ఒకరిపై ఉంటే రిజిస్టేషన్‌లు మరొకరి పై ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములు కాపాడండి.. ఆది ప్రజల ఆస్తి.. అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి ప్రజా అవసరాలకు విద్యా, వ్యవసాయ గ్రామ అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూ భారతి పై అవగాహన సదస్సుకి హాజరు కావడం జరిగిందని తెలిపారు.






