- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటుకు రూ.5 వేలు చెప్పిన కేటీఆర్‌పై కేసు పెట్టాలి.. ఈసీకి మంత్రి పొన్నం రిక్వెస్ట్
ఓటుకు 5 వేల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఓటుకు 5 వేల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటు కి రూ.5 వేలు అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం అని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. చరిత్రలో అందరికీ తెలుసు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.6 వేలు ఇచ్చిన సంస్కృతి మీది అని మంత్రి ఆరోపించారు. ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ.. మరింత అభివృద్ధి చేస్తామని విశ్వాసం కలిగిస్తూ ఓట్లు అడుగుతున్నామని అన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారు.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిరి కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మేము 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, నూతనంగా ఉద్యోగాలు ఇచ్చాం, హైదరాబాద్ అభివృద్ధి చేస్తూ డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రోడ్లు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మా అభ్యర్థి చదువుకున్న వ్యక్తి పని చేయగలిగే శక్తి ఉన్న నవీన్ యాదవ్ ను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
ఉప ఎన్నికల్లో ఓటుకు 5 వేలు తీసుకోండి అని చెప్తున్న ఆ పార్టీ దుస్థితి చూసి జాలి పడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నీ ఎదుర్కోవడానికి బీజేపీ brs లు కుమ్మకై బీజేపీ మూడంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టిందన్నారు. మీరు బీజేపీ కి వేసిన brs కి ఓటు వెళ్తుంది.. brs కి వేసిన బీజేపీ కి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధిని కాంక్షించండని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. వీడియో ఇదే..






