- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ వీరోచిత పోరాటానికి కారణం అదే: మంత్రి పొన్నం సెటైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉనికి కోసం కేటీఆర్ చాలా సీరియస్‌గా పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారంలో పోయాకే ఆయన పోరాటంలో వేగం పెరిగిందని ఎద్దేవా చేశారు. కావాలనే నిత్యం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. BCని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్న కిషన్ రెడ్డికి తానూ ఓ సూచన చేయదలుచుకున్నాను.. తక్షణమే ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఒక బీసీ వ్యక్తికి తన కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, కులాలు, వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మెజార్టీ స్థానాలు గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.






