- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: ఓర్వలేకే మిస్ వరల్డ్ పోటీలపై ఆరోపణలు: పొన్నం ప్రభాకర్
ఈ ప్రభుత్వం ఏర్పాటైన నెల నుంచే కొంత మంది పిల్లిశాపనార్థాలు పెడుతున్నారని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి ఖండాంతరాలు దాటిందని ఇది చూసి ఓర్వలేక కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. వారి మీద వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి మిస్ వరల్డ్ పోటీల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెల నుండే వారు పిల్లి శాపనార్థాలు పెడుతూ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మిస్ వరల్డ్ (Miss World-2025) కార్యక్రమానికి ప్రభుత్వం నుండి సహకారం అందించామని ప్రజల భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాలు జరిగాయన్నారు. రామప్ప, పోచంపల్లి, వెయ్యి స్థంబాల గుడి, కాకతీయుల కోట, ఓల్డ్ సిటీ తెలంగాణ చరిత్రాత్మక అంశాలు సందర్శించడం ద్వారా తెలంగాణ గౌరవం పెరిగిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణను ప్రపంచమే గుర్తించే విధంగా జరిగాయని చెప్పారు. రాజకీయాలు వేరు వచ్చిన అతిథులు గౌరవించుకునే అంశం వేరని కానీ కొంత మంది ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
మన పిల్లలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి:
పిల్లల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం కావాలంటే వారి చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చదువే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పారు. ఇవాళ బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల్లో చదివి టెన్త్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టల్ లో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారని మరింత మంది విద్యార్థులకు మార్కులు వచ్చేలా అధ్యాపకుల కృషి పెరగాలన్నారు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ సంస్థ తరుపున ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు. గతంలో చదువుకోవడానికి వసతి లేదన్నారు. విద్యార్థులంతా పోటీ ప్రపంచంలో నెగ్గేలా విధానపరమైన మార్పులను అవగతం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం మెస్, కాస్మొటెకి చార్జీలను పెంచిందని చెప్పారు. మీ దగ్గర నుండి రైసింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని రేపటి తెలంగాణ భవిష్యత్తు కి మీరు మార్గదర్శకులుగా కావాలన్నారు. మన పిల్లలు దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే స్థాయికి ఎదగాలని చెప్పారు. స్టడీస్, ఆటలు, ఇతర నైపుణ్యాల్లో మంచి ప్రతిభ కనబరచాలన్నారు. భవిషత్ లో మనం ఏం కావాలని అనుకుంటున్నామో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆదిశగా ముందుకు పోవాలని అదే సమయంలో కేవలం విద్యాకే పరిమితం కాకుండా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుడాలన్నారు. జ్యోతి బాపులే సినిమాను అన్ని గురుకులాల్లో ప్రదర్శిస్తామని తల్లిదంత్రులతో సహా చూపెడతామని చెప్పారు. మహిళలు ఇంత గౌరవంగా చదువుకుంటున్నారంటే ఆనాడు సావిత్రి భాయ్ పూలే ఆదర్శాల ఫలాలు అన్నారు.






