- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yadagirigutta: యాదగిరిగుట్టలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని స్వామివారిని ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ
అలాగే యాదగిరిగుట్టలో నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు-2026 పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా 2026 జనవరి నెలంతా రోడ్డు భద్రతను ప్రధాన ఎజెండాగా తీసుకొని పని చేస్తామని వెల్లడించారు. జనవరి 1 నుంచి 31 వరకు ‘రోడ్డు భద్రతా మాసోత్సవం’ నిర్వహించి, రోడ్డు భద్రతకు సంబంధించి 31 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్వీట్ ఇదే..






