- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: బీసీ నాయకులకు మంత్రి పొన్నం కీలక పిలుపు
by Gantepaka Srikanth |
బీజేపీలోని బీసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక పిలుపునిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలోని బీసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక పిలుపునిచ్చారు. సోమవారం కేబినెట్ సమావేశం(Telangana Cabinet) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు అందరూ బీసీ రిజర్వేషన్ల కోసం సహకరించాలని కోరారు. ఇదే అంశంపై ఆగష్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో నిరసన తెలపాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం.. తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్రంలో కులగణన చేశామని అన్నారు. ఎన్నికలు ఆలస్యం అయితే.. స్థానిక సంస్థల నిధులకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు. కాగా, ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలవనున్నారు. అంతేగాకుండా.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి మద్దతు కూడా కోరనున్నారు.
Next Story






