చరిత్రలో హీనులుగా మిగిలిపోవాలని ఉందా?.. ప్రధాని మోడీపై మంత్రి పొన్నం ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-01 10:36:52  IST  )

కశ్మీర్‌ విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పిదం.. దశాబ్దాల తరబడి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని మోడీ(PM Modi) కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

చరిత్రలో హీనులుగా మిగిలిపోవాలని ఉందా?.. ప్రధాని మోడీపై మంత్రి పొన్నం ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కశ్మీర్‌ విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పిదం.. దశాబ్దాల తరబడి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని మోడీ(PM Modi) కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌‌లోని ఐక్యతా విగ్రహం వద్ద శుక్రవారం జరిగిన వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 550కి పైగా సంస్థానాలను సర్దార్ దేశంలో దేశంలో కలిపారని.. కశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని ఆకాంక్షించారని, ఆ ప్రయత్నాన్ని నెహ్రూ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ తప్పు.. దశాబ్దాల తరబడి కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగడానికి కారణమైందని నిందించారు.

తాజాగా.. నెహ్రూపై మోడీపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు. మాజీ ప్రధాని నెహ్రూపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర ఉద్యమం గురించి తెలవని మోడీ.. నెహ్రూని అవమానించే విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ముందు చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. చరిత్రను వక్రీకరించేలా మాట్లాడిన మీరు చరిత్రలో హీనులుగా మారకుండా ఉండాలంటే ఇలాంటి వ్యాఖ్యలు ఉపసహంరించుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. వీడియో

Next Story