మహా న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

by velandi.Saikiran |   (  Updated:2025-06-28 12:11:22  IST  )

మహా న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన

మహా న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : మహా న్యూస్ కార్యాలయాన్ని పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్న మంత్రి పొన్నం... మహా న్యూస్ ఉద్యోగులను పరామర్శించారు. వ్యక్తిగతంగా, వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని కార్యకర్తలను ఉసిగొల్పి దాడి చేయించడం సరికాదని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారం కోల్పోయిన తర్వాత ఇలా విచక్షణ కోల్పోయి మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

అటు మహా న్యూస్ ఛానల్ పై దాడిని తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖులు ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటనను ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇది ఇలా ఉండగా... మహా న్యూస్ ఛానల్ లో... గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై తప్పుడు కథనాలు ప్రచురణ చేశారని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలోనే మహా న్యూస్ ఛానల్ పై దాడికి దిగారు. చేతికి ఏది దొరికితే దాంతో.. న్యూస్ ఛానల్ లో ఉన్న వస్తువులను పగలగొట్టారు. రెండు కార్లు కూడా ధ్వంసం చేశారు గులాబీ పార్టీ నేతలు. ఇదంతా గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినట్లు చెబుతున్నారు.

Next Story