- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gurukulas: గురుకులాల్లో ఏం జరిగినా బాధ్యత మీదే.. అధికారులకు మంత్రి పొన్నం వార్నింగ్
ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ తదితర సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై సీరియస్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల గురుకులాల్లో (Gurukulas) జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ తదితర సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాల్ లు, ఆర్సీఓలు, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ లతో పాటు ఇతర అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు బాధాకరమని మంత్రి పొన్నం ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
అర్సీఓలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రిన్సిపాల్‌లు, టీచర్‌లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గురుకులాల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడొద్దు.. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు పోషకాలతో పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచింది.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గురుకులాల్లో ఏ సంఘటన జరిగినా అధికారులదే బాధ్యత అని వార్నింగ్ ఇచ్చారు.






