హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి కాలనీలకూ ఆర్టీసీ బస్సులు

by Gantepaka Srikanth |

ముషీరాబాద్ ఆర్టీసీ డిపో(Musheerabad RTC Depot)ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పరిశీలించారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి కాలనీలకూ ఆర్టీసీ బస్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: ముషీరాబాద్ ఆర్టీసీ డిపో(Musheerabad RTC Depot)ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పరిశీలించారు. అధునాతన టెక్నాలజీ ద్వారా ఆర్టీసీ అమలు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్(Digital Payments) అమలును పరిశీలించారు. డిజిటల్ పేమెంట్స్, ప్రయాణికుల వివరాలు, హెడ్ ఆఫీస్ కనెక్టివిటీ తదితర సాంకేతికత గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీలో అధునాతన సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక ఉపయోగించుకొని డిజిటల్ పేమెంట్స్ ద్వారా బస్సులో ప్రయాణం చేసేవారు టికెట్ లావాదేవీలు జరుపుకునే విధంగా కొత్త కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గత 3 నెలలుగా 16 -20 శాతం డిజిటల్ పేమెంట్స్ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల బస్సుల్లో డిజిటల్ పేమెంట్ పూర్తయ్యాయని అన్నారు. దాని డేటా హెడ్ ఆఫీస్‌లో వెంట వెంటనే అప్డేట్ అవుతుంది. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు. ఆదాయం ఎంత వస్తుంది అనే విషయం హెడ్‌ ఆఫీస్‌లో డేటా వస్తుందని అన్నారు. ఢిల్లీ మాదిరి ఇక్కడ కాలుష్యం ఉండకుండా తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈవీ వాహనాలు అమ్మకం జరుగుతోంది. చాలా కాలం తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈవీ, CNG, LPG ఆటోలకు పర్మిషన్లు ఇచ్చాం. అంతేగాకుండా.. ఆర్టీసీ సేవలు కొత్త కాలనీలకు విస్తరిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త కాలనీలకు ఓఆర్ఆర్ లోపల బస్సు రూట్లో ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యాలు పెంచేలా చేస్తున్నామని కీలక ప్రకటన చేశారు.

Next Story