- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా సీఎం రెడ్డి.. డిప్యూటీ సీఎం ఎస్సీ.. పీసీసీ చీఫ్ బీసీ: మంత్రి పొన్నం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao)పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao)పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. మంగళవారం ఉదయం ఆయన(Minister Ponnam Prabhakar) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టాడని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యం అంటున్నారని ఫైర్ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగిందని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ(BJP) ఎంపీలు రాజీనామా చేయాలి.. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తాం అని అన్నారు.
సుప్రీంకోర్టులో ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పారు. రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం, శాసనసభ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. బరాబర్ రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. తెలంగాణలోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి రినర్వేషన్లు ప్రక్రియను కాపాడుకునే దానిలో ముందుండాలని కోరారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిందే అని డిమాండ్ చేశారు.
గతంలో జనహిత అభియాన్ కేసులో WES సందర్భంగా స్పష్టంగా చెప్పింది. WES ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్లు కాబ్ ఎత్తివేశారు. ప్రామాణిక నివేదిక ప్రకారం సమాచారం సుప్రీంకోర్టులో ఉందని గుర్తుచేశారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వని బీజేపీ నుంచి బీసీలకు న్యాయం జరుగుతుందంటే నమ్మకం కలగడం లేదని అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం.. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే.. ఉప ముఖ్యమంత్రి ఎస్సీ.. మా పీసీసీ అధ్యక్షుడు బీసీ అని అన్నారు.






