కంటోన్మెంట్ విలీనం జరగాల్సిందే.. కేంద్రానికి మంత్రి పొన్నం డిమాండ్

by Ramesh Naini |

కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కంటోన్మెంట్ విలీనం జరగాల్సిందే.. కేంద్రానికి మంత్రి పొన్నం డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంటోన్మెంట్ విలీనానికి సంబంధించి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాస్తూ వెంటనే విలీనానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి సమానంగా జరగాలని కంటోన్మెంట్ పేరుతో జరుగుతున్న వివక్ష పై చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం త్వరగా తీసుకోవాలని కంటోన్మెంట్ ప్రజల సమస్యలు తీర్చేలా విలీనం త్వరగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కోరారు.

Next Story