Ponnam: మాటలు జాగ్రత్త.. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-01-07 11:49:55  IST  )

రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేసిన కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponnam: మాటలు జాగ్రత్త.. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన భాష చూస్తుంటే కేటీఆర్‍లో అసహనం పరాకాష్టకు చేరిందని అన్నారు. ఈ మేరకు ఓ విడియో విడుదల చేసిన పొన్నం.. వరుస ఓటములతో సహనం కోల్పోతున్న కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్దొడ్ని అవుతానని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, అనంతరం దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన కుటుంబం వారిదన్నారు. రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ఇటువంటి భాష వాడితే గొప్ప వాడివి కాలేవని దుయ్యబట్టారు. ఇలాంటి భాషతో కేటీఆర్ తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని ఇకనైనా రాహుల్ గాందీని ఈ రకంగా విమర్శించడం మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. కానీ ఈవిధంగా భాషను ఉపయోగించి మీ ప్రస్టేషన్ చూపించడాన్ని మానుకోవాలని లేదా ప్రజలే మీకు బుద్ధి చెబుతారన్నారు.

Next Story