- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు దమ్ముంటే ముందు ఆ పనిచేయాలి.. మంత్రి పొన్నం కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు చేతనైతే ముందు.. ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఒక లెటర్ రాయించుకొని రావాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు మేము రెడీ అని ప్రతి సవాల్ చేశారు. చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చేస్తారు.. కేసీఆర్‌తో లెటర్ రాయించుకుని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలని సూచించారు. మా సీఎం రేవంత్ రెడ్డి చర్చకి రమ్మన్నది కూడా అసెంబ్లీలోనే అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు రండి ఎవరేంటో తెలుస్తది.. మేమేం చేసామో.. మీరేం చేశారో అంతా చర్చిద్దామని చెప్పారు. అసెంబ్లీలో చర్చిస్తే అంత రికార్డయి ఉంటుందని అన్నారు. చేతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు.
కాగా, అంతకుముందుకు ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించి చెప్పిన టైమ్‌కు ప్రెస్ క్లబ్‌కు వచ్చాం. కనీసం మంత్రులైనా వస్తారనుకున్నా.. కానీ ఎవరు రాలేదు’’ అని కేటీఆర్ విమర్శించారు. రైతులపై సీఎం, మంత్రులకు గౌరవం లేదన్నారు. దీనికి మంత్రులు వరుసగా కౌంటర్స్ ఇస్తున్నారు.






