42 శాతం బీసీ రిజర్వేషన్లపై దయచేసి కోర్టుకు వెళ్లొద్దు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-09-26 12:13:35  IST  )

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లపై దయచేసి కోర్టుకు వెళ్లొద్దు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (BC reservation) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్‌లతో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎక్కడ ఢోకా లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు దేశానికి రోల్ మోడల్ కానుందని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల జీవోను అందరూ గౌరవించాలని అన్నారు. బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్లపై దయచేసి కోర్టుకు వెళ్లొద్దని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రిజర్వేషన్ల అమలుపై చిత్త శుద్ధితో ఉన్నామని అన్నారు.

Next Story