హైదరాబాద్ మరో ఢిల్లీలా మారకూడదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లాంటి నగరం మరో ఢిల్లీలా మారకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే రాష్ట్రంలో 540 ఈవీ బస్సులను హైదరాబాద్ కే పరిమితం చేశామని చెప్పారు.

హైదరాబాద్ మరో ఢిల్లీలా మారకూడదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లాంటి నగరం మరో ఢిల్లీలా మారకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే రాష్ట్రంలో 540 ఈవీ బస్సులను హైదరాబాద్ కే పరిమితం చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మినీ బస్సులను, ఈవీ బస్సులను నడుపుతున్నామని అన్నారు. భవిష్యత్ లో మరో 2200 ఈవీ బస్సులను హైదరాబాద్ లో ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రజాజీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూస్తున్నామని అందువల్లే ఈవీ బస్సులు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనివల్ల ఆర్థికభారాన్ని తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత ఆర్టీసీలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చామ‌ని అన్నారు. అందులో భాగంగానే హైద‌రాబాద్ లో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఈవీ బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నామ‌ని చెప్పారు.

Next Story