ఆ డ్రైవర్‌ను ఉద్యోగం నుండి తొలగించలేదు: మంత్రి పొన్నం

by Ajay Maddhiboyina |

ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల్లో నుండి తొలగించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినందుకు బస్సు డ్రైవర్‌ను ఉద్యోగం నుండి తొలగించారనే ప్రచారం నిజం కాదని చెప్పారు.

ఆ డ్రైవర్‌ను ఉద్యోగం నుండి తొలగించలేదు: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల్లో నుండి తొలగించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినందుకు బస్సు డ్రైవర్‌ను ఉద్యోగం నుండి తొలగించారనే ప్రచారం నిజం కాదని చెప్పారు. అతను నేరుగా ఆర్టీసీ ఉద్యోగి కాదని హైర్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ అని అన్నారు. అయినప్పటికీ సదరు బస్సు యజమానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అతనిని ఉద్యోగం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని ఆదేశించినట్టు తెలిపారు. ఈ చిన్న విషయాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కానీ రైతుల పక్షాన ఎవరు సానుకూలంగా మాట్లాడినా, నిర్మాణాత్మక విమర్శలు చేసినా ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

పంట కొనుగోలు కోసం అధికారయంత్రాంగం పనిచేస్తుందని అన్నారు. పంట అనుకున్నదాని కంటే ఎక్కువగా రావడం వల్ల ఆలస్యం అవుతోందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు పెంచుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అశోక్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించామని కానీ అతడిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యం ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాబట్టి ఈ విషాయన్ని రాజకీయం చేయాలని చూడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు.

Next Story