Ponnam Prabhakar: అసెంబ్లీలోనే నిర్ణయం ప్రకటిస్తాం

by Gantepaka Srikanth |

తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) భేటీపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టత ఇచ్చారు.

Ponnam Prabhakar: అసెంబ్లీలోనే నిర్ణయం ప్రకటిస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) భేటీపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టత ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం కేబినెట్‌ సమావేశం ఉంటుందని వెల్లడించారు. అనంతరం అదే రోజున మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, కులగణనపై సుదీర్ఘ చర్చ జరుపబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం, సోమవారం కులగణనపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కానుందని అన్నారు. 5వ తేదీన కులగణనపై కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్‌(Union Budget-2025)లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఐకాన్ సిటీ హైదరాబాద్‌కు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ(BJP) నేతలు భిక్షాటన చేయడం కాదు.. తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలని అడిగారు. కేంద్రంతో బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని.. రాష్ట్ర వాటా కోసం కేంద్రంపై పోరాటానికి మాతో బీఆర్‌ఎస్(BRS) కలిసిరావాలి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాగా, కేబినెట్ భేటీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

Next Story