Miss World: ఫెమినా మిస్ ఇండియాకు స్వాగతం పలికిన మంత్రి పొన్నం, స్మితా సబర్వాల్

by Ramesh Naini |   (  Updated:2025-04-26 11:45:58  IST  )

72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఫెమినా మిస్ ఇండియా - 2023 నందిని గుప్తా హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు.

Miss World: ఫెమినా మిస్ ఇండియాకు స్వాగతం పలికిన మంత్రి పొన్నం, స్మితా సబర్వాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 72వ మిస్ వరల్డ్ పోటీల (Miss World 2025) నేపథ్యంలో (Femina Miss India) ఫెమినా మిస్ ఇండియా - 2023 నందిని గుప్తా (Nandini Gupta)హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. ఈ మేరకు శనివారం బేగంపేట టూరిజం ప్లాజాలో నందిని గుప్తాకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నందిని గుప్తను సత్కరించారు. కాగా, 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు తెలంగాణలో జరగనున్న విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్-2025 పోటీలు మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 140 దేశాలకు చెందిన వారు పాల్గొననున్నారు. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయి. ఈ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story