- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Ponnam: బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల (BC Reservations) చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని కామెంట్ చేశారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ (Assembly)లో చట్టం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)ను ఆమోదింపజేసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) చేపట్టిన సమగ్ర సర్వే (Comprehensive Survey)లో కేవలం 3.1 శాతం మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదని అన్నారు.
రెండో విడత కులగణన (Cast Census)లో సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని పిలపునిచ్చారు. అదేవిధంగా సర్వే విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ (BRS) నేతలు కూడా కులగణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తమిళనాడు (Tamilnadu) తరహా షెడ్యూల్-9 పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi), తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. తెలంగాణ (Telangana) జనాభా లెక్కల్లో ఉండొద్దని కోరుకునే వారిని తాను సర్వేలో పాల్గొనాలంటూ బ్రతిమిలాడబోమని.. వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఏంటో తనకు తెలియదని అన్నారు. బీసీ సంఘాల నేతలు, మేధావులు అంతా ప్రజలంతా సమగ్ర సర్వేలో పాల్గొనేలా వారిలో చైతన్యం నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.






