- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Passport:ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్టు సేవాకేంద్రం ప్రారంభించిన మంత్రి పొన్నం
ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో (MGBS, Metro Station) పాస్ పోర్టు సేవా కేంద్రం (Passport Sevakendram) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ (Passport Sevakendram) ఈ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. పాస్ పోర్టు ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉందని తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు పాస్ పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కాగా ఇన్నాళ్లు అమీర్ పేట్ ఆదిత్య ట్రేడ్ సెంటర్ లోని సేవలు అందించిన పాస్ పోర్టు కేంద్రం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు తరలించారు. దీనితో పాట టోలీ చౌకీ షేక్ పేట్ నాలా ఆనంద్ సిలికాన్ చిప్ వద్ద ఉన్న పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని రాయదుర్గం ప్రాంతంలోని పాత ముంబయి రోడ్డు సిరి బిల్డింగ్ లోకి మార్చారు. ఇవాళ్టి నుంచి కొత్త ప్రదేశాల్లో ప్రజలకు సేవలు అందించనున్నాయి.
ఎంజీబీఎస్ పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫండి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పాస్ పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ కే.జే శ్రీనివాసులు, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.






