- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Ponnam: ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. డీఏపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మేరకు 2.5 శాతం డీఏను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. తాజా నిర్ణయంతో రేవంత్ సర్కార్ (Revanth Government)పై ప్రతి నెలా రూ.3.6 కోట్లు అదనపు భారం పడనుంది. మంత్రి పొన్నం ఆలోచన మేరకు మహిళా దినోత్సవాన్ని (Women's Day) పురస్కరించుని మహిళా సాధికారత దిశగా తెలంగాణ సర్కార్ (Telangana Government) ముందుకు సాగుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే పరమావధిగా శనివారం నుంచి ఇందిరా మహిళా శక్తి బస్సును ప్రారంభం కానున్నాయి. మొదటి ఫేజ్‌లో మండల మహిళా సమైక్య సంఘాల నుంచి 150 బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. రెండో ఫేజ్‌లో మరో 450 బస్సును అద్దె ప్రాతిపదికన మహిళా సమైక్య సంఘాలు ఆర్టీసీతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అట్టహాసంగా ప్రారంభించనున్నారు.






