- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Ponnam: నీకు దమ్ము, ధైర్యం లేవా కేటీఆర్.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూములపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తిప్పికొట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూములపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తిప్పికొట్టారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూములపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటుండ్రా..! అంటూ సెటైర్లు వేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న ఆ బీజేపీ (BJP) ఎంపీ ఎవరో కేటీఆరే (KTR) చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను చేసినప్పుడు వారి పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేవా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అలాగే, ఇటీవల కాలంలో బీజేపీ (BJP) నేతలు సీఎం మార్పుపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. అది వారి అవివేకానికి పరాకాష్ట అని సీరియస్ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని.. ఒకవేళ సీఎం మార్పే ఉంటే అవిడే ఆ విషయంలో ఎప్పుడో ప్రకటన చేసే వారని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు.






