- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోటికాడి ముద్ద లాగొద్దు.. EWS రిజర్వేషన్లు వస్తే వ్యతిరేకించలేదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల కేటాయిస్తూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల కేటాయిస్తూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి బీసీ రిజర్వేషన్ల వివాదం చెలరేగుతోంది. బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) కేటాయించడం సరికాదంటూ హైకోర్డులో రెండు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణను అక్టోబర్ 8కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అయితే.. ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. ఆయన శనివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్లు, రాష్ట్రపతి ఒక వేళ పెండింగ్‌లో పెడితే.. ఆ ప్రతిపాదనలు అమలు చేసుకోవచ్చని, చట్టం ప్రకారమే నేడు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 రిజర్వేషన్ల జీవో వచ్చినట్లు తెలిపారు. తాము 10 శాతం EWS రిజర్వేషన్లు (EWS Reservations) కేంద్రం ఇచ్చినప్పుడు ఎవరిని కూడా వ్యతిరేకించలేదని, అందరికీ న్యాయం జరగాలని కోరుకున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాల నోటికాడి ముద్ద లాగవద్దు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.






