- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC: మోయలేనంత భారమేమి కాదు.. బస్ పాస్ ధరల పెంపుపై మంత్రి పొన్నం క్లారిటీ
బస్ పాస్ ధరల పెంపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెరిగిన బస్ పాస్ ధరలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. టోల్ ట్యాక్స్ లను కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఆ నష్టాన్ని పూరించుకునేందుకు టోల్ ట్యాక్స్ రూట్లలో మాత్రమే బస్ పాస్ చార్జీలు (bus pass fare hike) పెంచామని చెప్పారు. హైదరాబాద్ లో ఇక నుంచి విద్యార్థులకు మెట్రో ఎక్స్ ప్రెస్ ల్లో కూడా ప్రయాణ సౌకర్యం కల్పించామని అందువల్లే ఇక్కడ కూడా కాస్త బస్ పాస్ చార్జీలు పెంచామన్నారు. కొన్నే్ళ్లుగా బస్ పాస్ చార్జీలు పెంచలేదని మహాలక్ష్మి స్కీమ్ (Mahalakshmi scheme) ఉచిత ప్రయాణం కింద రూ. 6 వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చామన్నారు. మహాలక్ష్మి స్కీమ్ కారణంగా ఆర్డీనరీ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణించడం ఇబ్బందిగా మారిందని అందువల్ల వారికి మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ అనుమతి ఇస్తున్నామన్నారు. పెంచిన చార్జీలు వారు మోయలేనంత భారమైనదేమి కాదని అన్నారు. పెరుగుతున్న అన్ని రకాల ధరల వల్ల స్వల్పమార్పులు చేశామన్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ తగ్గిస్తే ఒకే నిమిషంలో ఆ రూట్లలోని బస్ పాస్ చార్జీలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.






