Minister Ponnam: బీజేపీ పక్కా వ్యాపారుల పార్టీ.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Minister Ponnam: బీజేపీ పక్కా వ్యాపారుల పార్టీ.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పక్కా వ్యాపారుల పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేపట్టిన సమగ్ర కులగణన (Cast Census) దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అధికారుల నిరంతర పర్యవేక్షణలో కొనసాగిందని పేర్కొన్నారు. సర్వేపై బీసీ(BC)ల్లో ఎక్కడా అసంతృప్తి లేదని.. కావాలనే విపక్షాలు ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేళ ఎవరికైనా.. కులగణన (Cast Census)పై అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని స్వాగతించారు.

సర్వేలో పాల్గొనని వారి కోసమే మళ్లీ సర్వే చేయాలని నిర్ణయించామని.. ఇది రీసర్వే కాదని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 28 వరకు మరోసారి అవకాశం కల్పించామని అన్నారు. కులగణనపై బీఆర్ఎస్ (BRS) నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని ధ్వజమెత్తారు. మరో విపక్షం బీజేపీ (BJP) పక్కా వ్యాపారుల పార్టీ అని కామెంట్ చేశారు. అదానీ (Adani).. అంబానీ (Ambani)లకు ఆ పార్టీ దోచిపెడుతంటే నిరుపేదలకు అమలు చేసే రిజర్వేషన్ల విలువ వాళ్లకు ఏం తెలుస్తుందిలే అని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లకు తాము పూర్తి వ్యతిరేకమని కోర్టులో అఫిడవిట్‌ ఇచ్చిన పార్టీ బీజేపీ (BJP).. కాదా అని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ (BC Reservations) కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహింస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story

Most Viewed