Minister Ponnam: ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు.. కేటీఆర్ : మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

పదేళ్ల బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పాలనలో తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహాన్ని ఎందుకు అధికారంగా ఏర్పాటు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)ను ప్రశ్నించారు.

Minister Ponnam: ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు.. కేటీఆర్ : మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పాలనలో తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహాన్ని ఎందుకు అధికారంగా ఏర్పాటు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)ను ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేదని.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల తగినట్లుగానే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ఎందుకు ప్రకటించలేదో బీఆర్ఎస్ (BRS) నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.

తాము ప్రతిపక్షంలో ఉన్న నాడు.. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) చేసిన పనులకు ఎన్నడూ ఇలా అడ్డు పడలేదని, కొన్ని విషయాల్లో సూచనలు, సలహాలు ఇచ్చినా తమను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. విగ్రహ ఏర్పాటుపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) నేతలకు నిరసన తెలిపే హక్కు ఉందని.. అంతకంటే ముందు పదేళ్ల పాలనలో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయలేదో ప్రజలకు కేటీఆర్ (KTR) సమాధానం చేప్పాలన్నారు. తెలంగాణ (Telangana) అస్తిత్వాన్ని చాటే విధంగా విగ్రహా రూపకల్పన జరిగిందని తెలిపారు. ప్రజలు, మేధావులు, కవులు సూచనలతోనే తెలంగాణ తల్లిని ప్రతిష్టించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story