- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురి స్వార్థం కోసం ‘ధరణి’ తీసుకొచ్చారు.. మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
కేవలం నలుగురి స్వార్థం కోసం ‘ధరణి’ (Dharani)ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేవలం నలుగురి స్వార్థం కోసం ‘ధరణి’ (Dharani)ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన జగిత్యాల (Jagityal) జిల్లా బుగ్గారం (Buggaram)లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) తీసుకొచ్చిన ‘ధరణి’ రైతులను నట్టేట ముంచిందని.. దాంతో మాజీ ముఖ్యమంత్రి కుటుంబం, కోటరీ రూ.కోట్ల విలువైన భూములు కాజేసిందని కామెంట్ చేశారు. భూ సమస్యలపై రైతులు కలెక్టరేట్లు, కోర్టుల చుట్టూ ఇప్పటికీ చెప్పులరిగేలా తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. అన్నదాతల కన్నీళ్లను తుడిచి వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకే తాము భూభారతి (Bhubharati) చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం..
ఇక నుంచి ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. గత పలకులు దొరికిచోటల్లా అప్పులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ పేదలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయించామని తెలిపారు. పూర్తయిన ఇళ్లకు గాను లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఈనెల 20 నుంచి 25 వరకు ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.






