MPTC, ZPTC ఎన్నికలపై మంత్రి పొంగులేటి జోస్యం

by Gantepaka Srikanth |

MPTC, ZPTC ఎన్నికలపై మంత్రి పొంగులేటి జోస్యం

MPTC, ZPTC ఎన్నికలపై మంత్రి పొంగులేటి జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) సత్కరించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో గెలుపొందిన సుమారు 400 మందికి పైగా సర్పంచులను, వందలాది మంది వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలపారు.

ప్రజాప్రభుత్వం(Congress Govt) ఏర్పడిన తర్వాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ విజయాలు ఇందిరమ్మ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతానికి పైగా స్థానాల్లో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిన విజయాల వెనుక కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, కృషి ఎంతగానో ఉంది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు పునరావృతం అవుతాయి. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ శీనన్నగా నేను ఉన్నాను.. ఏ ఒక్క కార్యకర్తకు ఆపద వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట ప్రసన్న, శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఆదినారాయణ, సీనియర్ నేత రాంరెడ్డి గోపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Next Story