- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి కీలక అప్ డేట్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని పనులు 18 నెలల ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసి చూపుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ తాము వెళ్తుంటే ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్షాలు కాకిగోల పెడుతున్నారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పత్రాల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బై ఎలక్షన్స్ ఎక్కడ వస్తే అక్కడ మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని ఉప ఎన్నికలు ఎన్నికలు లేని మిగతా చోట్ల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అటువంటిది మేము కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) ఇవ్వడంతో పాటు సన్నబియ్యం ఇస్తున్నది కేవలం మీ దీవెనలతో ఏర్పడ్డ ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఎవరూ మర్చిపోవద్దని కోరారు. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల దీవెనలు ఈ ప్రభుత్వానికి ఉండాలని కోరారు.
పక్క రాష్ట్రంతో లాలూచిపడ్డది మీరు:
తమ స్వలాభం కోసం తెలంగాణ రైతుల హక్కులను కాలరాస్తూ పక్క రాష్ట్రంతో లాలూచిపబడ్డది బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆరేనని మంత్రి పొంగులేటి విమర్శించారు. కమిషన్ల కోసం ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వ పాలకులు తెరపైకి తీసుకువచ్చారని వారి వేసిన పునాదే ఈనాటి బనకచర్ల ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక్క చుక్క నీటి బొట్టును, తెలంగాణ రాష్ట్ర హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉందన్నారు. ఈ ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా పేదలకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని మరో మూడు విడతలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇండ్లు రాని వారు ఎవరూ నిరుత్సాహ పడవలసిన అవసరం లేదన్నారు.






