- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక .. జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశం

దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indla Scheme) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇసుక అందిస్తోందని దీని కోసం లబ్ధిదారులు రూపాయి కట్టాల్సిన పని లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక పంపిణీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉండాలని లబ్ధిదారులకు ప్రత్యేక టోకెట్లు ఇచ్చి వారికి ఇసుక సరఫరా చేసేలా చేర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. ములుగులో ఐటీడీఏతో కలిపి 5 వేల ఇళ్లు ఇచ్చామని వాటికి అదనంగా మరో వెయ్యి ఇండ్ల కోసం జాబితాను అధికారులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడాల్సిన అవసరంలేదని వచ్చిన వారు ఎంత త్వరగా నిర్మాణం చేపడితే వారికి ప్రతీ సోమవారం డబ్బులు పంపిణి చేస్తున్నామన్నారు. గతంలో నివాసం ఉంటున్నవారు వారున్న చోట ఇళ్లు నిర్మించుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అవకాశం కల్పించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేకపోయినా, ప్రతినెల వడ్డీ, అసలు రూ. 6,500 కోట్లు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజల పిల్లలకు సరిగా భోజనం అందుతుందో లేదో పట్టించుకోలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 200 కోట్లతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇదంతా డబ్బు ఉన్నదని చేయడం లేదని గత ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం చేస్తే మన ప్రభుత్వం డబ్బును పొదుపు చేసి పేదవారికి అండగా ఉండాలని పని చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వంపై ఉండాలన్నారు.






