ఇంత‌కంటే మంచి అవ‌కాశం మళ్లీ రాదు: మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |

ఇంత‌కంటే మంచి అవ‌కాశం మళ్లీ రాదు: మంత్రి పొంగులేటి

ఇంత‌కంటే మంచి అవ‌కాశం మళ్లీ రాదు: మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: గ‌త పన్నెండు ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వ‌హించ‌లేద‌ని, ఫ‌లితంగా ఇక్కడ అభివృద్ది కుంటుప‌డినందున ఈ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్ధి న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి కోరారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రి పొంగులేటి రహ్మత్ న‌గ‌ర్ డివిజ‌న్‌లోని కార్మిక‌ న‌గ‌ర్‌, బ్రహ్మ శంక‌ర్ న‌గ‌ర్, రామిరెడ్డి న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్యటించి ప్రజ‌లు, కార్యక‌ర్తల‌తో సమావేశమ‌య్యారు. రెహమత్ నగర్ నుంచి బోరబండ వరకు మంత్రి పొంగులేటి నిర్వహించిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. వేలాదిమంది కాంగ్రెస్ జెండాలు చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడిచిన 23 నెలలుగా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, ఈ ప్రాంతానికి ఎంతో సుపరిచితుడూ, యువకుడైన నవీన్ యాదవ్ కు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పదేళ్లూ బీఆర్ఎస్ అధికారం..ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని మంత్రి పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేసి మీ సంక్షేమానికి, కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయాల‌ని, ఈ ప్రాంత‌ప్రజ‌ల‌కు ఇంత‌కంటే మంచి అవ‌కాశం రాద‌న్నారు.

Next Story