Minister Ponguleti: గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?

by Gantepaka Srikanth |

Minister Ponguleti: గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?

Minister Ponguleti: గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగిస్తే చరిత్ర మారుతుందా అని.. పేరును తొల‌గించ‌డం అంటే గాంధీని అవ‌మానించిన‌ట్లేన‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార, పౌర‌సంబంధాల‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ఆయ‌న పేరును తొల‌గించ‌డం సిగ్గుచేట‌ని తెలిపారు. నిరుపేద కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాల‌న్న ల‌క్ష్యంతో 2005లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం చారిత్రాత్మక‌మైన‌ ఉపాధి హామీ ప‌థకాన్నితీసుకొచ్చిందని.. ప‌దేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఆ ప‌థకానికి తూట్లు పొడుస్తూ వస్తున్నదని విమ‌ర్శించారు. మహాత్మాగాంధీ పేరును తొలగించి, రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని నెట్టి పేదల పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్‌లో తీసుకొచ్చిన బిల్లు అభివృద్ధి తిరోగ‌మ‌న‌మేన‌ని, రాష్ట్రాల‌పై మోయ‌లేని భార‌మ‌ని పేర్కొన్నారు. లోక్‌సభలో బ‌ల‌వంతంగా గురువారం ఆమోదించిన ఈ కొత్త బిల్లు, పథకం స్వభావాన్ని, నిధుల సమీకరణను పూర్తిగా మార్చివేసింద‌ని విమ‌ర్శించారు. పేరు మార్చినంత మాత్రాన కేంద్ర పాలకులు వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోలేరని తెలిపారు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ, గ్రామీణ భారతానికి వెన్నెముకగా ఉన్న పథకాన్ని అగాధంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story