- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగ్గారెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి.. కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి ఫోన్
దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రిక్వెస్ట్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రిని కలసిన జగ్గారెడ్డి, తన నియోజకవర్గంలోని రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యను వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలోని సిద్దాపూర్‌లో 5 వేలు, కొండాపూర్ మండలంలోని అలియాబాద్‌లోని 4 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా, బీఆర్ఎస్ పవర్‌లోకి రాగానే ఆ పేదలను అక్కడ్నుంచి పంపించేశారన్నారు.
స్థలాలు ఉన్నా, ఇళ్లు నిర్మాణం చేపట్టకుండా గత బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులు గురి చేసిందని జగ్గారెడ్డి మంత్రికి వివరించారు. దీంతో వెంటనే మంత్రి పొంగులేటి సంగారెడ్డి కలెక్టర్‌కి ఫోన్ చేసి పేద ప్రజల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు క్లియర్ చేయాలని సూచించారు. దీంతో సంగారెడ్డి నియోజకవర్గంలో 9 వేల మంది పేదలకు ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కలిగింది.