- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి.. స్పందించిన మంత్రి పొంగులేటి
కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు(Mohan Babu) దాడి చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు(Mohan Babu) దాడి చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ స్పందించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao), కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar)లు స్పందించి ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని అన్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పందించారు. మంగళవారం రాత్రి ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. తక్షణమే మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






