- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందేళ్ల వరకు ఇక టెన్షన్ అవసరం లేదు: మంత్రి పొంగులేటి
వందేళ్ల వరకు ఇక టెన్షన్ అవసరం లేదు: మంత్రి పొంగులేటి

దిశ, వెబ్‌డెస్క్: జనవరి నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సహచర మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులతో కలిసి జాతర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహించి, అమ్మవార్ల కృపతో అభివృద్ధి పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సమయానికి ఏర్పాట్లు పూర్తయేలా దీవించమని కోరారు. కున్నాను. అనంతరం సమ్మక్క-సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి, ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ, జంపన్న వాగు వద్ద పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మరో వందేళ్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ జాతరకు గిరిజనులు, గిరిజనేతరులు దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు, జాతర ప్రారంభం నాటికి నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకువెళ్తున్నట్లు తెలిపారు. జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి పనులను భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంగణాన్ని మహా అద్బతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.






