Dynamic: భూభారతి చట్టం అమలుపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Bhoopathi Nagaiah |

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంతో రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ తీరిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

Dynamic: భూభారతి చట్టం అమలుపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

భూభారతి చట్టం గ్రామగ్రామన రెవెన్యూ సదస్సులు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంతో రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ తీరిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. భూ భార‌తి చ‌ట్టంలో భాగంగా గ్రామ గ్రామాన రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహిస్తామని బుధ‌వారం ఆయన ఓ ప్రక‌ట‌న‌ రిలీజ్ చేశారు. తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్సవం రోజైన జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స‌ద‌స్సులు నిర్వహించ‌నున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. పూర్తి వార్త కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఇస్రోకు భారీగా నిధుల కేటాయింపు

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన తొలి కేబినెట్ మీటింగ్‌లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా ఆమోదం లభించింది. యూపీలోని జేవర్లో 6వ సెమీ కండక్టర్ యూనిట్‌ను నిర్మించేందుకు మంత్రివర్గం ఓకే చెప్పిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకు రూ.3,706 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

రెండు కాదు.. 16 రాష్ట్రాల్లో ఉన్నాం.. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన

కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతిచర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర హోంశాంఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారని గుర్తు చేశారు. అయితే అంతకుముందు ఎటువంటి షరతులు లేకుండా శాంతిచర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించి నేడు అందుకు భిన్నంగా కాల్పుల విరమణ ప్రకటించకుండానే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు పెట్టారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు పరిమితమైలేదని, దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో పార్టీ పని చేస్తోందని తెలిపారు. అందుకే శాంతిచర్చల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

వ్యవసాయ రంగంలో ఏపీ నంబర్​వన్.. ప్రకటించిన సీఎం సీబీఎన్

వ్యవసాయ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ ఉందని, పరిశ్రమలు కూడా వస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరి ఉపాధి పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని పశు సంవర్థకక శాఖ టెక్ ఏఐ2.0 కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'పాత్ వేస్ టు ప్రాస్పెరిటీ', నెక్స్ట్- జెన్ యానిమల్ హస్బెండ్రీ', 'విజనరీ' అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పశుసంవర్థక విభాగంలో సమ్మిళిత, స్థిరమైన వృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పేదరిక నిర్మూలన వంటి వాటిపై రాసిన ఈ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని, వారిలో తెలుగు వాళ్లే అధికమన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్ లోనే నని చెప్పారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story