- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma illu) మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma illu) మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు చూడకుండా ప్రతీ పేదోడికి ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం బెల్టు షాపులు పెట్టిస్తే.. తాము వచ్చాక రేషన్ షాపులు పెట్టిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 5.20 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని వెల్లడించారు. రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసా చెల్లించి రైతులను ఆదుకున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల్లో భరోసా కల్పించినట్లు తెలిపారు. మరో నాలుగైదు నెలల్లో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.
అంతకుముందు అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం అశ్వరావుపేట రింగ్ రోడ్ నుంచి దొంతికుంట చెరువు వరకు మార్నింగ్ వాక్ చేశారు. ప్రజలను పలకరిస్తూ వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.






