ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం.. మంత్రి పొంగులేటి ప్రకటన

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.

ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం.. మంత్రి పొంగులేటి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గురువారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈనెల 15 తేదీన కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులతో కలిసి సమీక్షించారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అందుకే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను బీసీల కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సాధించామని అన్నారు. ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకమైందని ఈ సభను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించారు.

Next Story