కేసీఆర్ చేసిన పెద్ద మిస్టేక్ అదే.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలన, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) హాట్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్ చేసిన పెద్ద మిస్టేక్ అదే.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలన, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో పొంగులేటి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ(Revenue System)ను తన దగ్గర పెట్టుకొని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు.. స్వేచ్ఛగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదని గుర్తుచేశారు. పదేళ్ల పాటు ఒక్క మంత్రిని కూడా సరిగా పనిచేయనీయలేదని అన్నారు. భూభారతి వల్ల 70 శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా తాము సక్సెస్ అయినట్లే అని చెప్పారు. భూభారతి(Bhu Bharati)లో కొత్త సాఫ్ట్వేర్ రాబోతోందని కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరగదు.. జరగనివ్వను అని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. జూన్‌లో సర్వే మ్యాప్ ఫైలెట్ ప్రాజెక్టు ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేస్తామని వెల్లడించారు. 6 వేలు దరఖాస్తులు సర్వేకు వచ్చాయి.. భర్తీ చేయబోతున్నామని అన్నారు. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుంది ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుందని చెప్పారు.

Next Story