Ponguleti: కమీషన్లు రావనే కేసీఆర్ ఆ పని చేయలేదు: పొంగులేటి

by Prasad Jukanti |   (  Updated:2025-09-06 08:10:12  IST  )

Ponguleti: కమీషన్లు రావనే కేసీఆర్ ఆ పని చేయలేదు: పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కమీషన్ల కోసం కాళేశ్వరం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ (KCR).. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రం కట్టివ్వలేకపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. ఇండ్లు కడితే కమీషన్లు రావని తెలిసే ఇండ్లు కట్టలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశం (Indiramma housing Scheem) చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లితో పాటు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేదవారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని వారి హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని పాత రేషన్ కార్డుల్లో 17 లక్షల మంది పేర్లను చేర్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఉంటే అందరికీ ఇళ్లు వచ్చేవన్నారు. రాబోయే మూడు విడతల్లో ప్రతి గ్రామంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చి ఇస్తామన్నారు. పదేళ్ల పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పు భారం ప్రజలపై మోపిందని విమర్శించారు.

Next Story