- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్
పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని, పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని, పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి సోమవారం వరకు ఈ వారానికి సంబంధించి లబ్ధిదారులకు రూ.22.64 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి వారం రోజుల్లో ఇప్పటి వరకు 1,549 ఇండ్లు బేస్‌మెంట్, 481 ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో 117 ఇండ్లు శ్లాబ్ వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టుపెట్టయినా సరే ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులను విడుదల చేసి తీరుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంతవరకు బేస్మెంట్ వరకు 9,877, గోడల వరకు 1,839, స్లాబు పూర్తయినవి 388 ఉన్నాయని.. వాటికి మొత్తం రూ.98.64 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని.. నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదని లబ్ధిదారులు తమ స్థలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ జరుగుతున్నదని, లబ్ధిదారులకు ఇంజినీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి పొంగులేటి సూచించారు.






