- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ : మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పునర్వ్యవస్ధీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పునర్వ్యవస్ధీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీశ్, వేముల వీరేశం తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్దీకరణ వరకు ఇష్టానురీతిలో మొక్కుబడిగా జరిగాయని, దీంతో ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్ధితి ఏర్పడిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ
అదేవిధంగా తమను పొగిడినవారి కోసం ఒక విధంగా, పొగడని వారికోసం మరో విధంగా, తమ అదృష్టసంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశాన్నారు. దీంతో రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ చేపడతామని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా నివేదిక తేప్పించి ఇదే శాసనసభలో చర్చించి అందరి ఆమోదంతో పునర్వ్యవస్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.






