మంత్రి పొంగులేటి హెలికాప్టర్ ల్యాండింగ్‌కు బుల్లెట్ ఫైర్.. తప్పిన ప్రమాదం

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-19 09:10:44  IST  )

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.

మంత్రి పొంగులేటి హెలికాప్టర్ ల్యాండింగ్‌కు బుల్లెట్ ఫైర్.. తప్పిన ప్రమాదం
X

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లా‌కు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణం‌లో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్‌లో తెలుసుకోండి.

తెలంగాణ పోటీ అమరావతి, బెంగళూరు, ముంబయి, చెన్నైతో కాదని, లండన్, టోక్యో వంటి అభివృద్ధి చెందిన నగరాలతోనేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చని పిలుపునిచ్చారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన ‘తెలుగు వెలుగు పండుగ సంబరాలు’ వేడుకల్లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్​ పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు చెక్ పడింది. ఎట్టకేలకు జీవీఎంసీ మేయర్​ పీఠాన్ని కూటమి పార్టీలు సొంతం చేసుకున్నాయి. వైసీపీ మున్సిపల్ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు ఇవాళ మున్సిపల్​ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. అయితే కూటమి నేతలు అవిశ్వాసాన్ని ఎలా నెగ్గారో ఈ లింక్‌ను చూడవచ్చు.

ఆలయంలో పెళ్లి పీటలపై కూర్చున్న వధువు ఏడుస్తుండటంతో అక్కడకు వచ్చిన భక్తులు వివాహాన్ని ఆపేశారు. ఈ ఘటన అన్నవరం ఆలయంలో చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. కుటుంబ పెద్దలు వివాహ వేడుకను వైభవంగా జరిపిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో 22 ఏళ్ల యువతి పెళ్లి కూతురిగా ముస్తాబై మండపంలో ఏడుస్తు్ండగా.. భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది గమనించి పెళ్లిని అడ్డుకున్నారు. ఇంతకు వాళ్లు పెళ్లిని ఎందుకు ఆపేశారో ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.

Next Story