సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి BIG అప్డేట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-15 06:34:19  IST  )

స్థానిక ఎన్నికల(Local Body Elections)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) బిగ్ అప్డేట్ ఇచ్చారు.

సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి BIG అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల(Local Body Elections)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ నెలాఖరు నోటిఫికేషన్ రాబోతోందని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ప్రకటించారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్(Sarpanch Elections), మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మరోవైపు.. ప్రభుత్వం గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను ఇప్పటికే తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రిజర్వేషన్లు సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం నెలకొననుంది.

Next Story