- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: కేసీఆర్ దుఃఖం దేనికి? అధికారం పోయిందనా లేక నీ అవినీతి బయటపడుతోందనా?: పొంగులేటి
మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తప్పు చేసింది కాబట్టే రెండు సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలే మూడోసారి బీఆర్ఎస్ కు వాతలు పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దుఃఖం వస్తోందని పదే పదే అంటున్నారని పదవి పోయిందని దుఃఖం వస్తోందా? లేక మీ అవినీతి బయటపడుతోందని దుఃఖం వస్తోందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూడలేకే కేసీఆర్ కు దఃఖం వస్తోందని విమర్శలు గుప్పించారు. ఇవాళ కామారెడ్డి జిల్లా షట్ పల్లి, వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ లో నిర్వహించిన భూభారతి (Bhu Bharati) అవగాహన సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారులు మాట వినలేదని గతంలో కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేశారని పది రోజుల్లో గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో భూభారతి ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
మీవి పగటి కలలే:
రూ. 8.19 లక్షల కోట్ల అప్పులు చేసి ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసి బీఆర్ఎస్ మా చేతిలో పెట్టిందని మంత్రి ధ్వజమెత్తారు. పదేళ్లలో రెండు పడక గదుల ఇళ్లు ఎంత మందికి ఇచ్చారో మాజీ సీఎం చెప్పాలన్నారు. పదేళ్లలో పూర్తి చేయకుండా మొండిగోడలు ఉంచిపోతే పూర్తి చేసి మేము ప్రజలకు ఇస్తున్నామన్నారు. పేదల కన్నీరు తీర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అన్ని వర్గాలను ఆదుకునే విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేయదన్నారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న వారి కలలు కలలుగానే మిగులుతాయన్నారు.






